27 April, 2026 | 8:31 PM

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలిగించవద్దు

27-04-2026 07:10 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించవద్దని సర్పంచ్ నున్న యాదగిరియాదవ్ అన్నారు.సోమవారం మండల పరిధిలోని కోమటిపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సూర్యనాయక్ తండా సర్పంచ్ లూనావత్ కృష్ణనాయక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందాలని సూచించారు.కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలిగితే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని అన్నారు.