30 May, 2026 | 1:44 PM

Breaking News

దేశంలో ఎక్కడాలేని సమస్య తెలంగాణలోనే ఉంది: కిషన్ రెడ్డి   •   భూగర్భ జలాలు తగ్గడంతో సడక్ గూడకు ట్యాంకర్ నీరు   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. బాల్కసుమన్ అరెస్టుకు రంగం సిద్ధం   •   తీవ్ర విషాదం: బోల్తా పడిన ట్రాక్టర్— ఆరుగురు మృతి   •   ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. 126 మందికి తప్పిన ప్రమాదం   •   వడ్రంగి వృత్తికి అటంకం కలిగిస్తున్న అటవీశాఖ అధికారులు   •   రోడ్డు పక్కనే నీటిగుంత.. ప్రజలకు తప్పని తిప్పలు   •   డీకే శివకుమార్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. గవర్నర్‌తో భేటీ   •   తహశీల్దార్ కార్యాలయంలో సిబ్బంది ఆలస్యంగా విధులకు.. ప్రజల నిరీక్షణ   •   అన్నకు చెల్లెలి నగ్న ఫోటో పంపి డబ్బులు డిమాండ్.. యువకుడు అరెస్ట్   •  

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. బాల్కసుమన్ అరెస్టుకు రంగం సిద్ధం

30-05-2026 12:55 PM

హైదరాబాద్: తెలంగాణ భవన్(Telangana Bhavan) వద్ద శనివారం నాడు ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) అరెస్టుకు  రంగం సిద్ధం అయింది. బాల్క సుమన్ ప్రస్తుతం తెలంగాణ భవన్ లో ఉన్నారు. బాల్క సుమన్ ను అరెస్ట్ చేసేందుకు నాంపల్లి పోలీసులు(Nampally Police) తెలంగాణ భవన్ కు చేరుకున్నారు.

తెలంగాణ భవన్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. తెలంగాణలో మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేయాలని బాల్క సుమన్ ఇటీవల పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు(Congress Leaders) ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో నాంపల్లి పోలీస్ స్టేషన్ లో బాల్క సుమన్ పై కేసు నమోదైంది.

పోలీసులతో మాట్లాడిన బీఆర్ఎస్ లీగల్ టీమ్

అటు బాల్క సుమన్ కు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్(BRS Party Legal Team) రంగంలోకి దిగి పోలీసులతో మాట్లాడింది. బాల్క సుమన్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు అయినట్లు అబిడ్స్ ఏసీపీ తెలిపారు. నాన్ బెయిలబుల్ కేసులో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఏసీపీ సూచించారు. బాల్క సుమన్ తెలంగాణ భవన్ లో ఉన్నారనే సమాచారంతోనే వచ్చామన్న అబిడ్స్ ఏసీపీ  బాల్కసుమన్ ను విచారించాలని పేర్కొన్నారు.