30 May, 2026 | 1:48 PM

Breaking News

BRS మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ “అరెస్ట్”   •   దేశంలో ఎక్కడాలేని సమస్య తెలంగాణలోనే ఉంది: కిషన్ రెడ్డి   •   భూగర్భ జలాలు తగ్గడంతో సడక్ గూడకు ట్యాంకర్ నీరు   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. బాల్కసుమన్ అరెస్టుకు రంగం సిద్ధం   •   తీవ్ర విషాదం: బోల్తా పడిన ట్రాక్టర్— ఆరుగురు మృతి   •   ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. 126 మందికి తప్పిన ప్రమాదం   •   వడ్రంగి వృత్తికి అటంకం కలిగిస్తున్న అటవీశాఖ అధికారులు   •   రోడ్డు పక్కనే నీటిగుంత.. ప్రజలకు తప్పని తిప్పలు   •   డీకే శివకుమార్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. గవర్నర్‌తో భేటీ   •   తహశీల్దార్ కార్యాలయంలో సిబ్బంది ఆలస్యంగా విధులకు.. ప్రజల నిరీక్షణ   •  

భూగర్భ జలాలు తగ్గడంతో సడక్ గూడకు ట్యాంకర్ నీరు

30-05-2026 01:07 PM

జైనూర్, మే 30 (విజయక్రాంతి): వేసవి తీవ్రతతో జంగం గ్రామపంచాయతీ పరిధిలోని సడక్ గూడలో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. దీంతో బోర్లు, కుళాయిల్లో నీరు రాకపోవడంతో గ్రామ ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించిన గ్రామ పంచాయతీ సర్పంచ్ పెందూర్ అనుసయా అర్జున్, ఉప సర్పంచ్ సయ్యద్ సజ్జద్ అలీ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేశారు. ప్రతి వీధికి ట్యాంకర్ పంపించి ప్రజలకు నీటిని అందించారు.ట్యాంకర్ నీటితో తాత్కాలిక ఉపశమనం లభించిందని గ్రామస్థులు తెలిపారు. శాశ్వత పరిష్కారం కోసం అదనపు బోర్లు, పైపులైన్ మరమ్మతులకు చర్యలు తీసుకుంటామని సర్పంచ్ అనుసయా అర్జున్ తెలిపారు.