7 June, 2026 | 12:20 PM

న్యూయార్క్‌లో తెలంగాణ యువకుడు మృతి

07-06-2026 11:15 AM

అమెరికా: న్యూయార్క్ లో తెలంగాణ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లిన యువకుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. వివరాల్లోకి వెళ్తే... తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన కుంచ శ్రీనివాస్, నీలిమ దంపతుల కుమారుడు కంచ అన్షుల్(28), 2023లో అమెరికా వెళ్లాడు. అమెరికాలోని నార్త్ ఫిలడెల్ఫియాలో నివాసం ఉంటూ కేడబ్ల్యూసీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. వారంతాంలో అదనపు ఆదాయం కోసం పిజ్జా డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పార్ట్-టైమ్ పని చేస్తున్నాడు. శనివారం రాత్రి నిర్మానుష్యమైన ప్రాంతంలోని ఓ ఇంటికి మూడు పిజ్జాల డెలివరీ ఆర్డర్ అతనికి వచ్చింది.

అతను రాత్రి 12.30 గంటలకు అక్కడికి చేరుకోగానే, గుర్తు తెలియని వ్యక్తి ఒకరు కాల్పులు జరిపి, అన్షుల్ తలపై పలుమార్లు కాల్చి అక్కడి నుంచి పారిపోయాడు. అన్షుల్ కు బుల్లెట్ గాయాలు కావడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలారు. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకోని మృతదేహాన్ని, మూడు బుల్లెడు షెల్స్ స్వాధీనం చేసుకున్నారు. వీలైనంతా త్వరగా తన సోదరుడి మృతదేహాన్ని భారత్ కు తీసుకోచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మృతుడి సోదరి మీడియా ముందు వాపోయ్యారు.