7 June, 2026 | 12:19 PM

ప్రతి ఒక్కరూ సైక్లింగ్ ప్రాధాన్యత ఇవ్వాలి

07-06-2026 10:47 AM

ప్రపంచ సైకిల్ దినోత్సవం: కలెక్టర్ ఆశిష్ సంగువాన్

కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో సైక్లింగ్ ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్ ఆవరణలో ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పిట్ ఇండియా సైక్లింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జండా ఊపి ప్రారంభించారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు  క్రీడల మంత్రిత్వ శాఖ సహకారంతో ఫిట్ ఇండియా ఉద్యమం కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం, శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే సైక్లింగ్‌ను ప్రజల్లో ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... సైక్లింగ్ అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా కాలుష్య నియంత్రణకు దోహదపడుతుందన్నారు.

ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో సైక్లింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజంతో పాటు పచ్చని పర్యావరణాన్ని నిర్మించడంలో భాగస్వాములు కావాలని సూచించారు. దేశవ్యాప్తంగా ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. యువత, విద్యార్థులు, క్రీడాకారులు, ప్రభుత్వ అధికారులు , వివిధ వర్గాల ప్రజలు ఉత్సాహంగా ఈ సైక్లింగ్ ర్యాలీలో పాల్గొన్నారు.