6 May, 2026 | 9:36 PM

Breaking News

కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •  

పికిల్‌బాల్ నేషనల్స్‌కు తెలంగాణ జట్టు ప్రకటన

12-11-2025 12:00 AM

హైదరాబాద్, నవంబర్ 11: తొలిసారి జర గనున్న జాతీయస్థాయి పికిల్‌బాల్ పోటీలకు తెలంగాణ పికిల్‌బాల్ అసోసియే షన్(టీపీఏ) 46 మందితో పటిష్టమైన జట్టును ప్రకటించిం ది. తెలంగాణ స్టేట్ నెంబర్ వన్ ప్లేయర్ సమీ ర్ వర్మ టీమ్ మెంటార్‌గా , సీనియర్ ప్లేయర్ శ్రీకర్ తెలంగాణ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిం చబోతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పికిల్‌బాల్ టీమ్ ధరించే జెర్సీని ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఆవిష్కరించారు.

జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ పికిల్‌బాల్ ప్లేయర్స్ చక్కని ప్రదర్శన కనబరచాలని ఆకాంక్షించారు. గతకొంతకాలంగా పికిల్‌బా ల్‌కు పెరుగుతున్న క్రేజ్‌ను చూస్తే సంతోషంగా ఉందని, రానున్న రోజుల్లో మరిన్ని టోర్నీలు నిర్వహిస్తామని తెలంగాణ పికిల్‌బాల్ అసోసి యేషన్ సెక్రటరీ, ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ విష్ణువర్థన్ చెప్పారు.కాగా జాతీయ పికిల్‌బాల్ పోటీలు నవంబర్ 13 నుంచి 16 వరకూ బెంగ ళూరులో జరగబోతున్నాయి.