తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ఎన్నికలు
- అధ్యక్షుడిగా అమిత్ సంఘీ
- నాలుగేళ్ల పాటు కొత్త కార్యవర్గం బాధ్యతలు
హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాం తి): తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ (టీఆర్ ఏ) (Telangana Rifle Association) 13వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీ ఎం), 2026 కాలానికి సంబంధించిన ఎన్నికలను సోమవారం హైదరాబాద్ బం జారాహిల్స్‌లోని అసోసియేషన్ రిజిస్టర్డ్ కా ర్యాలయంలో విజయవంతంగా నిర్వహించా రు. ఎన్నికల ప్రక్రియను హైకోర్టు న్యాయవా ది పి. అమరేందర్ రెడ్డి రిటర్నింగ్ ఆఫీసర్‌గా పర్యవేక్షించారు. ఎన్నికల ప్రక్రియను వివిధ క్రీడా సంస్థలకు చెందిన పరిశీలకులు పర్యవేక్షించారు.
నిర్దేశిత ఎన్నికల ప్రక్రియ పూర్త యిన అనంతరం ఎన్నికైన కొత్త కార్యవర్గాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ అధికారికంగా ప్రకటించారు. అధ్యక్షుడిగా అమిత్ సంఘీ, సీనియర్ ఉపాధ్యక్షుడిగావసీఫ్ హసన్ లతీఫ్, ఉపాధ్యక్షులుగా మహమ్మద్ సోహైల్‌ఉద్దీన్ ఫరూఖీ, డాక్టర్ మహమ్మద్ సలీమ్ మూసా ప్రధాన కార్యదర్శిగా జమాల్పురి కిరణ్, కోశాధికారిగా డాక్టర్ వంశీధర్ నాలి, సంయుక్త కార్యదర్శిగా మహ్మద్ ముస్తఫా ఖాన్, కార్యవర్గ సభ్యులుగా బొబ్బిలి నర్సయ్య,
కె శ్రవణ్ కుమార్, మహమ్మద్ హసన్ షరీఫ్, అనీషా బన్సల్, మందపాటి సత్య రాణి, నవాబ్ ఎం షఫాత్ అలీ ఖాన్, మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ ఎన్నికయ్యారు. కాగా ఎన్నికైన సభ్యులందరూ తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ రాజ్యాంగం, నిబంధనలు, ఉపనిబంధనలు, నిర్దేశిత ఎన్నికల విధానాలకు అనుగుణంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఆర్‌ఏఐ)కు చెందిన కల్యాణ్ సింగ్ కపాసియా, తెలంగాణ ఒలిపింక్ అసోసియేషన్(టీవోఐ)కు చెందిన పి.మల్లారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ(ఎస్‌ఏటీజీ)కు చెందిన అశోక్‌కుమార్ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు.






