calender_icon.png 5 February, 2026 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బంగారు బాతు

05-02-2026 02:32:36 PM

హైదరాబాద్: 'సేవ్ తెలంగాణ-ఓట్ ఫర్ బీజేపీ' అనే నినాదంతో బీజేపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్(BJP PowerPoint presentation) ఇచ్చింది. సేవ్ తెలంగాణ పేరుతో పాటను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వ భూములను అమ్మడం అభివృద్ధా? అని కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భూములు అమ్మాలి.. అప్పులు చేయాలనేది కాంగ్రెస్ ఆలోచన అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాయని కిషన్ రెడ్డి ఆరోపించారు.

ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. అవినీతి, దోపిడీ ప్రభుత్వమని ఆయన ధ్వజమెత్తారు. వీధి దీపాలకు కూడా డబ్బులు లేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ఏపీలో అనేక విమానాశ్రయాలు ఉన్నాయి.. తెలంగాణలో ఎందుకు లేవన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) ఏమీ చేసిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బంగారు బాతు అయ్యిందన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. ఇక్కడి నుంచే డబ్బులు ఇస్తున్నట్లు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణను రక్షించుకోవాలంటే బీజేపీకి ఓటెయ్యాని కిషన్ రెడ్డి ఓటర్లను కోరారు.