7 July, 2026 | 7:59 PM

Breaking News

ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి   •   రహదారిపై వరి నాట్లు వేస్తూ నిరసన   •   రోడ్డు భద్రత, ఆటో రిక్షాలో ప్రయాణం, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన   •   మృతుడు బొల్లె ప్రశాంత్ కుటుంబానికి స్నేహితుల ఆర్థిక సహాయం   •   జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయి   •   బాన్సువాడ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటి   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి: ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   ఐకెపి రుణాలలో తాండూర్ అత్యధిక ఓవర్ డ్యూ   •   సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   డిగ్రీ ప్రవేశాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం   •  

బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు

07-07-2026 06:47 PM

సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని తిమ్మాజివాడి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్రం రాజాశేఖర్, మల్లయ్య, భిక్షపతి, సంతోష్, స్వామి వారితో పాటు మరి కొంతమంది మంగళవారం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్  వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలపై నమ్మకంతోనే తాము బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని చేరిన నాయకులు తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం కేవలం మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తోనే అభివృద్ధి సాధ్యమని వారి నాయకత్వంలో నడుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.