7 July, 2026 | 8:18 PM

ఇందిరమ్మ ఇండ్ల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు

07-07-2026 07:10 PM

మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కు విద్యుత్ సరఫరా ఏర్పాటు చేసేందుకు గాను మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో కరెంట్ స్తంభాల ఏర్పాటు  ప్రారంభించడం జరిగిందని  మున్సిపల్ చైర్ పర్సన్ బిరుదు రాధాకృష్ణ తెలిపారు,  ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు  చింతకుంట విజయ రమణారావు  ఆశీస్సులతో 15 వ ఫైనాన్స్ నుండి 11 లక్షల రూపాయలను తీసుకొని పలు వార్డులకు సంబంధించి కరెంటు స్తంభాలను కొనుగోలు చేసి వాటిని ఇందిరమ్మ ఇల్లుల దగ్గర , కరెంటు లేని ఏరియాలలో  వేయడానికి  మున్సిపల్ చైర్ పర్సన్ బిరుదు కృష్ణ  తొమ్మిదో వార్డు కౌన్సిలర్ ప్రభాకర్ తో కలిసి అవార్డులో స్తంభాలు వేయించడం జరిగినది.