7 July, 2026 | 7:41 PM

Breaking News

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి: ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   ఐకెపి రుణాలలో తాండూర్ అత్యధిక ఓవర్ డ్యూ   •   సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   డిగ్రీ ప్రవేశాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం   •   ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •  

గ్రామాల్లో ఘనంగా సీత్ల పండుగ సంబరాలు

07-07-2026 06:42 PM

బంజారా సంప్రదాయాలకు ప్రతీకగా అమ్మవారికి ప్రత్యేక పూజలు

డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలతో గ్రామస్థుల సందడి

కారేపల్లి,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో బంజారా గిరిజనుల ఆరాధ్య దైవమైన సాతిభవాని సీత్ల అమ్మవారి పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా భాగ్యనగర్ తండాలో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే గ్రామస్తులు ఇళ్లను శుభ్రపరిచి, రంగవల్లులు వేసి పండుగ ఏర్పాట్లు చేశారు. మహిళలు సంప్రదాయ బంజారా వస్త్రాభరణాలతో అలంకరించుకుని, అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి ప్రజలు ఆయురారోగ్యాలు, పశువులకు ఎలాంటి వ్యాధులు సోకకుండా ఉండాలని అమ్మవార్లను కోరుకున్నారు.

పండుగలో భాగంగా గ్రామ ప్రజలందరూ ఒకేచోట చేరి డప్పు వాయిద్యాల నడుమ గిరిజన సంప్రదాయలతో నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా గ్రామం వెలుపల ఉన్న సీత్ల భవాని వద్దకు చేరుకొని  భక్తులు తమ మొక్కులను చెల్లించుకుని, కొబ్బరికాయలు కొట్టి, పసుపు, కుంకుమ, నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు భక్తిగీతాలు ఆలపిస్తుండగా, యువకులు డప్పులు మోగిస్తూ బంజారా సంస్కృతికి అద్దం పట్టేలా సంప్రదాయ నృత్యాలతో అలరించారు.

సీత్ల పండుగ బంజారా గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, సామూహిక ఐక్యతకు ప్రతీకగా  ప్రతి కుటుంబం ఈ పండుగను అత్యంత పవిత్రంగా భావించి తరతరాలుగా వస్తున్న ఆచారాలను పాటిస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొనగా, చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొని బంజారా సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పారు.