ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరించిన నాయకులు
గంభీరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ 61వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మంద కృష్ణ మాదిగ వర్గీకరణ సాధన కోసం దీర్ఘకాలంగా పోరాటం చేసి, అన్ని వర్గాల హక్కుల కోసం కృషి చేసిన ఉద్యమ నాయకుడని కొనియాడారు. వర్గీకరణ ఫలాలు పొందాలంటే విద్య, ఉపాధిలో ముందుకు రావాలని సూచించారు.
అనంతరం ఎమ్మార్పీఎస్ జెండాను ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అంబేద్కర్ సంఘాల జిల్లా ఉపాధ్యక్షులు,ఇరిగి భాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అంబేద్కర్ సంఘాల మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల శంకర్, నాయకులు శనిగరపు నరేష్ వర్మ,ఐరిగి సందీప్ ఎర్రోళ్ల భీమ్రావు , పరశురాములు వెంకటేష్ శ్రీహరి మహేష్ బాలరాజు దేవయ్య బాలరాజ్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.






