05-02-2026 03:29:41 PM
20 వ వార్డు లో జోరుగా బి ఆర్ ఎస్ ప్రచారం
20 వ వార్డు బి ఆర్ ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మాధవరావుపల్లె సునీల్ వాల్మీకి
వనపర్తి,(విజయక్రాంతి): వార్డు అభివృద్ధి జరగాలంటే అది బి ఆర్ ఎస్ తోనే సాధ్యమని 20 వ వార్డు బి ఆర్ ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మాధవరావుపల్లె సునీల్ వాల్మీకి అన్నారు. గురువారం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 20 వ వార్డు లో జోరుగా స్థానిక బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి అభ్యర్థి ప్రచారం ను నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వనపర్తి పట్టణంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి పనులను వివరిస్తూ, మరొక పక్క ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని సైతం వివరిస్తున్నామని 20 వ వార్డు బి ఆర్ ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మాధవరావుపల్లె సునీల్ వాల్మీకి అన్నారు. కారు గుర్తు కు ఓటు వేసి భారీ మెజారిటీ అందించాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ ప్రచార కార్యక్రమం లో స్థానిక నాయకులు వార్డు ప్రజలు పాల్గొన్నారు