సీసీ రోడ్ల పనులు ప్రారంభం
07-07-2026 06:31 PM
ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బండమీది కవిత గోపి
ధర్మపురి,(విజయక్రాంతి): వెల్గటూర్ మండల కేంద్రంలో రూ. 11 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిమెంట్ కాంక్రీట్ (CC) రోడ్ల నిర్మాణ పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యులు,రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవతో ఈ నిధులను మంజూరు చేయించారు. స్థానిక సర్పంచ్ బండమీద కవిత - గోపి, ఉపసర్పంచ్ గండ్ర ప్రతాప్ రావు మరియు ప్రజాప్రతినిధులు,కొబ్బరికాయ కొట్టి అధికారికంగా ఈ పనులు ప్రారంభించారు. మండల కేంద్రంలో రోడ్ల నిర్మాణంతో అంతర్గత రవాణా ఇబ్బందులు తొలగిపోతాయని, ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.






