calender_icon.png 5 February, 2026 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలు పరిష్కారం కావాలంటే సీపీఐని బలపరచండి

05-02-2026 01:43:57 PM

ఇంటింటి ప్రచారంలో జిలాని బేగం 

పాల్వంచ,(విజయక్రాంతి): స్థానిక సమస్యలు పరిష్కరించాలంటే, స్థానికంగా ఉండి సమస్యలపై అవగాహన కలిగిన అభ్యర్థిని ఆశీర్వదించాలని జిలని బేగం అభ్యర్థించారు. ఈనెల 11వ తేదీన జరగనున్న కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్ 46వ డివిజన్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్న సిపిఐ అభ్యర్థి జిలాని బేగం ప్రచారంలో ముందున్నారు.

తన మద్దతు దారులతో ఇంటింటికి తిరుగుతూ 46వ డివిజన్లో నెలకొన్న స్థానిక సమస్యలు పరిష్కరించాలంటే ఓటు అనే ఆయుధంతో తనను ఆ బలపరచాలని ఓటర్ల దేవుళ్ళను కోరారు. ప్రధానంగా వీధిలైట్లు డ్రైనేజీ తాగునీరు పారిశుద్ధ్యం సమస్యలను అనునిత్యం పర్యవేక్షించి పరిష్కరిస్తానని ఓటర్లకు ఆమె హామీ ఇచ్చారు. ప్రచార కార్యక్రమంలో స్థానిక ఆర్ఎంపి వైద్యులు అభ్యర్థి భర్త మస్తాన్, వార్డ్ ఇన్చార్జిలు, సిపిఐ, తెలుగుదేశం మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.