5 March, 2026 | 4:20 PM

ఫర్నీచర్ దుకాణం యజమాని బెయిల్ పిటిషన్.. తీర్పు రిజర్వు

05-03-2026 02:33 PM

హైదరాబాద్: అబిడ్స్ ఫర్నీచర్ దుకాణం(Abids Furniture Store Fire) యాజమాని పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) విచారణ చేపట్టింది. బెయిల్ మంజూరు చేయాలంటూ ఫర్నీచర్ షాప్ యజమాని పిటిషన్ వేశాడు. అగ్నిప్రమాదంపై పిటిషనర్ కు ఎలాంటి సంబంధం లేదని న్యాయవాది కోర్టుకు తెలిపారు. దుకాణ యజమాని కొన్ని రోజులుగా జైలులోనే ఉన్నాడని పిటిషనర్ న్యాయవాది సూచించారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని న్యాయవాది తెలిపారు.

ఫర్నీచర్ గోదాంకు ఎలాంటి అనుమతి లేదని పీపీ నాగేశ్వర్ రావు(P.P. Nageswara Rao) తెలిపారు. నిర్వాహకుడి నిర్లక్ష్యం వల్లే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని పీపీ ధర్మాసనానికి వెల్లడించారు. సెల్లార్ లో వాచ్ మెన్ కు వసతి ఇవ్వడంతో పాటు ఫర్నీచర్ నిల్వ ఉంచారని చెప్పారు. అగ్నిప్రమాదం వల్ల ప్రాణాలు కోల్పోయారని పీపీ నాగేశ్వర్ రావు సూచించారు. ర్యాంపుపై ఫర్నీచర్ ఎలా వేశారని పిటిషనర్ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ర్యాంపుపై ఫర్నీచర్ ఉండటం వల్లే సెల్లార్ లోని వారు రాలేకపోయారని కోర్టు తెలిపింది. ఫర్నీచర్ దుకాణం యజమాని బెయిల్ పిటిషన్ పై తీర్పును కోర్టు రిజర్వు చేసింది.


ఇవి కూడా చదవండి:


పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ

గల్ఫ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చే విమానాలు రద్దు

ట్యాంక్ బండ్ దగ్గర ఉద్రిక్తత.. ప్రజా సంఘాల నేతలు అరెస్ట్