17 June, 2026 | 3:46 AM

ట్రాఫిక్ సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ఎత్తుగడ

17-06-2026 12:00 AM

శేరిలింగంపల్లి, జూన్ 16 (విజయక్రాంతి): వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యం లో ట్రాఫిక్ అంతరాయాలు, పట్టణ వరదలు, నీటి నిల్వల సమస్యలను అడ్డుకో వడానికి తెలంగాణ సర్కార్ కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు మంగళవారం మల్కం చెరువు వద్ద అత్యవసర సమన్వయ సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజన, హైడ్రా కమిషనర్ రంగనాథ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, ఇరిగేషన్, హైడ్రా, జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ..వర్షాల వల్ల ప్ర జలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా పోలీసు శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందిని స్పష్టం చేశారు.

నీటి నిల్వ ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నా య మార్గాలు ఏర్పాటు చేయాలని, ప్రజలకు నిరంతరం సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాం తాలు, వరద ముప్పు ఉన్న జోన్లు, రద్దీ మా ర్గాలు, ప్రధాన కూడళ్లలో పోలీసు సిబ్బంది నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల సమయంలో ఏ విధమైన అత్యవసర పరిస్థితి వచ్చినా స్పందించేలా పోలీసు యంత్రాంగం సిద్ధం గా ఉండాలని డీజీపీ ఆనంద్ సూచించారు.

ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయి పర్యటన...

సమావేశంలో గురునాథ్ చెరువు, మి యాపూర్ చుట్టుపక్కల చెరువులు, బయోడైవర్సిటీ జంక్షన్ పరిసరాలు, కొండాపూర్తో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ఇంజినీరింగ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ బృందాలు నీటి ప్రవాహ మార్గాలు, ఆక్రమణలు, డ్రైనే జీ వ్యవస్థ, నీటి నిల్వలకు కారణమయ్యే అం శాలను సమగ్రంగా పరిశీలించి,తక్షణ చర్య లు తీసుకోనున్నాయి. భవిష్యత్తులో ఇలాం టి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాల కోసం నివేదికలు సమర్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు.