17 June, 2026 | 4:52 AM

డ్రైనేజ్ శుభ్రతపై మున్సిపల్ చైర్మన్ దృష్టి

17-06-2026 12:00 AM

కల్లూరు, జూన్ 16 (విజయ క్రాంతి): రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య సమస్యలను నివారించేందుకు డ్రైనేజీ సమస్యలకు చెక్ పెట్టేందుకు కల్లూరు మున్సిపల్ పరిధిలో డ్రైనేజ్ శుభ్రతపై కమిషనర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.డ్రైనేజీలు సరిగా లేకపోతే వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో అన్ని వార్డుల్లో శుభ్రత పనులను వేగవంతం చేస్తున్నారు.

17వ వార్డులో కొనసాగుతున్న డ్రైనేజీ శుభ్రత పనులను మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్,నూతన కమిషనర్ జి. సాయి కృష్ణారెడ్డి సమీక్షించారు.పనుల పురోగతిని పరిశీలిస్తూ అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ కనపర్తి శ్యామల,16వ వార్డు కౌన్సిలర్ ఉబ్బన రాంబాబు, మున్సిపల్ సిబ్బంది,జిల్లా యువజన కాంగ్రెస్ నాయకుడు ధరావత్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.