2 June, 2026 | 9:44 PM

గరిడేపల్లిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

02-06-2026 08:41 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి మండలంలో మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రైవేటు కార్యాలయాల్లో, రాజకీయ పార్టీల కార్యాలయం వద్ద జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండల తాసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ స్రవంతి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సరోజ, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐబి శ్రీకాంత్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి గన్న చంద్రశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు, రంగాపురంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కీ.శే పోటు రాఘవయ్య చౌదరి నివాసంలో ఆయన సతీమణి సరోజనమ్మ సమక్షంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుతారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రంగాపురం గ్రామ మహిళా సర్పంచి శ్రీమతి కట్ట కళ్యాణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.అనంతరం గ్రామ సర్పంచ్ కట్ట కళ్యాణి ని ఘనంగా సన్మానించారు.