2 June, 2026 | 9:44 PM

అమరుల త్యాగఫలను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం

02-06-2026 08:38 PM

* రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ ఎనలేని కృషి

* ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

అచ్చంపేట: ఎంతోమంది అమరవీరుల త్యాగపలను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన అని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పేర్కొన్నారు. స్వరాష్ట్రసాధన కోసం ఎంతోమంది ఆత్మబలి దానాలు చేసుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాష్ట్ర సాధనకు ప్రత్యేక కృషి చేశారని ఆమె సహకారంతోనే స్వరాష్ట్రం సిద్ధించిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అచ్చంపేట పట్టణంలో నిర్వహించిన వేడుకల్లో అచ్చంపేట ఎమ్మెల్యే పాల్గొన్నారు.  ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, అంబేద్కర్ చౌరస్తా, పబ్లిక్ క్లబ్, అమరవీరుల స్తూపం తదితర ప్రాంతాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ప్రజల స్వాభిమానానికి ప్రతీక అని, ఉద్యమ ఆశయాల సాధనే తెలంగాణ అమరవీరులకు నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.