27 July, 2026 | 9:42 AM

డా. అనిల్ కుమార్ జాధవ్‌కు “ధన్వంతరి ఎక్సలెన్స్ అవార్డు 2026

27-07-2026 09:04 AM

ధన్వంతరి ఎక్సలెన్స్ అవార్డు - 2026తో సత్కరించబడిన డా. అనిల్ కుమార్ జాధవ్

కుభీర్  జులై 27(విజయక్రాంతి): వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తూ, రోగులకు నాణ్యమైన చికిత్సను అందించడంలో విశేష కృషి చేస్తున్న GDR & Krishna Multispeciality Hospital వైద్యులు డా. అనిల్ కుమార్ జాధవ్ గారికి ప్రతిష్టాత్మకమైన “ధన్వంతరి ఎక్సలెన్స్ అవార్డు – 2026” ప్రదానం చేయబడింది. వైద్య సేవల్లో నిబద్ధత, ఆధునిక వైద్య విధానాల అమలు, రోగుల పట్ల సేవాభావం, సమాజ ఆరోగ్యాభివృద్ధికి చేసిన కృషిని గుర్తిస్తూ ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా డా. అనిల్ కుమార్ జాధవ్ గారిని వైద్యులు, ప్రజాప్రతినిధులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఆసుపత్రి సిబ్బంది హృదయపూర్వకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలతో ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు.