27 July, 2026 | 9:42 AM

పెద్దపల్లి సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం

27-07-2026 09:06 AM

ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన బైక్‌ను ఆపి పెట్రోల్ పోసుకుంటుండగా, వేగంగా వచ్చిన ఓ కారు వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మృతుడి పూర్తి వివరాలు, గాయపడిన వారి వివరాలు, ప్రమాదానికి సంబంధించిన ఇతర సమాచారం తెలియాల్సి ఉంది.