2 June, 2026 | 4:34 PM

గిరిజన విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి

02-06-2026 03:16 PM

* ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవం..

* క్యాంప్ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ ఐటిడిఏ పరిధిలోని  ఉమ్మడి జిల్లాలోని  గిరిజన ప్రాంతంలో గిరిజనుల విద్యాభివృద్ధిపై  ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉందని  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉట్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం పాత బస్టాండ్ వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఉట్నూర్ ఐటీడీఏ  కార్యాలయంలో పీవో మంద మకరందు తో కలిసి రాష్ట్ర ఆవిర్భవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాల్గొన్నారు.  తెలంగాణ తల్లి, ప్రొ.జయశంకర్ ల చిత్రపటాలకు పూల మాలలు  వేసి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో అధికారులు విద్య వ్యవస్త పైదృష్టి పెట్టాలని, ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విద్య వ్యవస్త బలోపేతానికి కృషి చేస్తుంది అన్నారు.ప్రజలకు అధికారులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు,కాంగ్రెస్ పార్టీ తోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందని ఎమ్మెల్యే గుర్తు చేశారు.ఐటీడీఏ పీవో గారితో కలిసి ఐటిడిఎ ప్రాంగణంలో మొక్కలు నాటరు,ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు,కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.