వెయ్యి ఊరిలో మర్రి వద్ద నివాళి
02-06-2026 03:20 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెయ్యి ఊరిలో మర్రి అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేతలు నివాళులు అర్పించారు. ప్రభుత్వ చీఫ్ వీప్ వేముల వీరేశం మాజీ మంత్రి ఏ ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ శ్రీహర్రావు స్థానిక ఉద్యమకారులు ఉన్నారు. నిజాం నిరంకుశ పాలన వ్యతిరేకంగా ఆనాటి పోరాటంలో పాల్గొన్న రాంజీ గోండి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో మహానుభావులు పోరాడారని గుర్తు తెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు






