నాగిరెడ్డిపేట్ బారాస ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం...
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని రాంప్రతాప్ థియేటర్ ప్రాంగణం వద్ద మాజీ సురేందర్ సూచనల మేరకు జాతీయ జెండాతో పాటు బారాస జెండాను ఎగరవేశారు.ఈ సందర్భంగా మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య,నియోజకవర్గ సీనియర్ నాయకులు రాంప్రతాపరెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వెనుక ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో త్యాగాలు ఉన్నాయనన్నారు.
అలాగే తెలంగాణ ఉద్యమం ఒక ప్రత్యేకమైన నిరసనలతో ప్రారంభమైందని,ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో పలు రకాల ఉద్యమాలు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందనన్నారు. సకలజనుల సమ్మె, విలీనియం మార్చ్, వంటావార్పు,బస్సు రోకో,రైలు రోకో, బతుకమ్మలతో బోనాలతో వివిధ రకాల నిరసన కార్యక్రమాలు చేసినటువంటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏచెట్టును అడిగిన, ఏగుట్టని అడిగినా, ఏపుట్టని అడిగినా, ఏగాలినడిగినా, ఏ నీరునడిగినా వచ్చేది ఒకటే మాట అది తెలంగాణ ఉద్యమ ఉదండు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మార్గదర్శకాలు అకుంఠిత దీక్ష విద్యార్థి సంఘాల కుల సంఘాలు యువజన సంఘాలు ఉద్యోగ సంఘాలు పెన్షనర్స్ సంఘాలుతో పాటు యావత్తు తెలంగాణ ప్రజల కృషితోటి ప్రత్యేక తెలంగాణను అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించామనన్నారు.తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై తుపాకీలు ఎక్కువ పెట్టినవారు. ఈరోజు పెద్ద పెద్ద పదవులు చేపడుతున్నారనన్నారు.






