తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
అమనగల్లు: తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, ఆయన ధర్మపత్ని సుమలతతో కలిసి సోమవారం కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి(Tirumala Tirupati Devasthanam) వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆలయ వెలుపల గోలి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. లోకకళ్యాణం కోసం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మరియు కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నారు. దర్శనానంతరం ఆలయ పండితులు రంగనాయకుల మండపంలో వీరికి వేదాశీర్వచనం చేయగా, అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.






