11 May, 2026 | 2:46 PM

మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం

11-05-2026 01:04 PM

మల్లాపూర్, మే, 11(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట క్లస్టర్ గ్రామాలలో సోమవారం వ్యవసాయ పరిశోధన స్థానం పొలాస శాస్త్రవేత్తలు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వ్యవసాయంలో ఎదురయ్యే సమస్యలు, పంటల నిర్వహణ, దిగుబడి పెంపు, పురుగు నివారణ వంటి అంశాలపై పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా డా. రాకేష్ మాట్లాడుతూ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ద్వారా రైతులు తమ సందేహాలను నేరుగా శాస్త్రవేత్తలను అడిగి నివృత్తి చేసుకునే అవకాశం కల్పించిందని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోల్కొండ కళ రమేష్, ఉప సర్పంచ్ దండవేణి రాజేందర్, జలపతి రెడ్డి, స్థానిక రైతులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. రైతులు తమ పంటలకు సంబంధించిన సమస్యలను శాస్త్రవేత్తలతో చర్చించి పలు సలహాలు పొందారు.