11 May, 2026 | 2:46 PM

పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న

11-05-2026 01:00 PM

బోథ్,(విజయక్రాంతి):  ఈ ఏడాది జొన్న మొక్కజొన్న పంటల సాగు(Cultivation of Maize Crops) విస్తీర్ణం పెరగడంతో పంట కోతకు యంత్రాలు దొరకకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఈ ఏడాది బోత్ సోనాల మండలాల్లో కలిసి 22000 ఎకరాలలో జొన్న మొక్కజొన్న పంట లు సాగుతున్నాయి. అయితే పంట కోతకు వస్తున్న సమయంలో కోత యంత్రాలు దొరకక రైతులు సతమతమవుతున్నారు.

పంట పూర్తిగా ఎండిపోవడంతో యంత్రాల ద్వారా కటింగ్ చేయించి విక్రయించాలన్న దృక్పథంతో రైతులు ఉన్నారు. ఇటీవల చేతి కచ్చే పంట అగ్ని ప్రమాదాల వల్ల రైతులు నష్టపోతుండడంతో పంటను ఎలాగైనా ఇంటికి తీసుకురావాలన్న ఉద్దేశంతో రైతులు ఉన్నారు. మరోవైపు వర్షాలు కురుస్తుండడంతో చేతికందే పంట జొన్న తిండి గింజలు చెడిపోయే ఆస్కారం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా రైతులు యంత్రాల దొరకక సతమతమవుతున్నారు.