22 May, 2026 | 8:28 PM

Breaking News

బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •  

బీఆర్ఎస్ పార్టీ నేతలను మర్యాదపూర్వకంగా కలిసిన తెలబాటి నరేష్

15-12-2025 10:12 PM

గరిడేపల్లి (విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహణ అధ్యక్షులు, మాజీ ఐటి శాఖ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ ని అలాగే మాజీ విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంతకళ్ల జగదీశ్వర్ రెడ్డిని కీతవారిగూడెం గ్రామవాసి, గరిడేపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నాయకులు తెలబాటి నరేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, స్థానిక రాజకీయ పరిస్థితులు, సోషల్ మీడియా ద్వారా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లే అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. పార్టీ కోసం క్రియాశీలంగా పని చేస్తున్న కార్యకర్తలకు నాయకులు అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులో మరింత సమర్థంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.