పొలిమేర ప్రాంఛైజీలోకి అర్జున్ సర్జా
ఓటీటీలో ‘మా ఊరి పొలిమేర’తో సంచలనం సృష్టించి, థియేటర్లలో ‘పొలిమేర 2’తో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు అనిల్ విశ్వనాథ్ తెరకెక్కిస్తున్న హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ఇప్పుడు ‘పొలిమేర -3’గా మరింత పవర్‌ఫుల్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వంశీ నందిపాటి, జాన్వీ నారంగ్లు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
సికింద్రాబాద్‌లోని గణేశ్ ఆలయంలో సంప్రదాయ పూజలతో ప్రారంభమైందీ సినిమా. ఈ ప్రారంభోత్సవానికి టాలీవుడ్ నిర్మాతలు అల్లు అరవింద్, డీ సురేశ్‌బాబు, సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, బన్నీవాస్ పాల్గొన్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఈ ‘పొలిమేర’ ఫ్రాంచైజీలో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. కామాక్షి భాస్కర్ల, సత్యం రాజేశ్, గెటప్ శ్రీను, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.






