29 July, 2026 | 1:16 AM

విదేశీ పర్యటనకు 190 మంది టీచర్లు

29-07-2026 12:12 AM

 ఎంపిక బాధ్యతలు జిల్లా కలెక్టర్లకు

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): ఐదు రోజుల విదేశీ పర్యటనకు ప్రభుత్వ ఉపాధ్యాయులు వెళ్లనున్నారు. ఫేజ్-2లో భాగంగా 190 మంది హెడ్‌మాస్టర్లు, ఉపాధ్యాయులు ఫిన్లాండ్, సింగపూర్, జపాన్, వియాత్నాం, చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ఎంపిక బాధ్యతను జిల్లా కలెక్టర్లకు పాఠశాల విద్యాశాఖ అప్పగిస్తూ బుధవారం ఆదేశాలు జారీచేసింది.

ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ విజిట్ ఎడ్యుకేషనల్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా ఉపాధ్యాయులు సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వెళ్లనున్నారు. ఇందులో గెజిటెడ్ హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపాల్స్, ఎస్జీటీలు, స్కూల్‌అసిస్టెంట్లు ఉన్నారు. ప్రతి జిల్లా నుంచి ఉపాధ్యాయులను ఎంపిక చేయాలని ఈ ఎంపికలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గానికి ప్రాధా న్యత ఇవ్వాలని అధికారులు పర్కొన్నారు.