న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం
కామారెడ్డి, జూలై 10 (విజయక్రాంతి): న్యాయవాద పరిషత్ కామారెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఏటా జూలై 10వ తేదీన న్యాయవాద పరిషత్ నిర్వహించే గురుపూజోత్సవం కార్యక్రమంలో భాగంగా సీనియర్ న్యాయవాదులు శంకర్ రెడ్డి, జగన్నాథం, రమేష్ చంద్ ,వెంకట్రామిరెడ్డి, రత్నాకర్ రావు లను న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ హాల్ లో శుక్రవారం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు సన్మాన గ్రహీతలు వారి సందేశంలో న్యాయవాద వృత్తి పైన కీలక సూచనలను న్యాయవాదులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి నారాయణ జనరల్ సెక్రెటరీ బి సురేందర్ రెడ్డి. కామారెడ్డి జిల్లా కోర్టు జిపి శ్యాం గోపాల్ రావు, న్యాయవాద పరిషత్ అధ్యక్షులు బి దామోదర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ సంతోష్ శర్మ, ఉపాధ్యక్షులు సందీప్ రెడ్డి, న్యాయవాద పరిషత్ సభ్యులు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, పాల్గొన్నారు.






