11 July, 2026 | 2:23 AM

ఇష్టారీతిన పార్కింగ్..!

11-07-2026 01:37 AM
  1. జవహర్‌నగర్ మెయిన్ రోడ్లపై అడ్డదిడ్డంగా పార్కింగ్
  2. ప్రజలకు చుక్కలు చూపిస్తున్న వాహనదారులు

జవహర్‌నగర్, జూలై 10 (విజయక్రాంతి): ఎక్కడ పడితే అక్కడ... ఎలా పడితే అలా... రోడ్లపైనే వాహనాలు పార్క్ చేయడం రోజురోజుకీ పెరుగుతోంది. ప్రధాన రహదారులపై గంటల తరబడి వాహనాలను నిలిపివేయడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఫైరింగ్ రేంజ్ గవర్నమెంట్ స్కూల్ నుండి జవహర్ నగర్ మున్సిపల్ ఆఫీస్ వరకు చాలా ఇరుకైన రోడ్ అయినా కూడా చాలా చోట్ల రెండు వైపులా వాహనాలు పార్క్ చేయడంతో రోడ్లు కుచించుకుపోయి, ఒకేసారి రెండు వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంటోంది.

దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర సేవల వాహనాలు కూడా ట్రాఫిక్లో చిక్కుకుంటున్నాయి. స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లను వ్యక్తిగత పార్కింగ్ స్థలాలుగా మార్చడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి, ‘నో పార్కింగ్‘ ప్రాంతాల్లో లేదా ట్రాఫిక్కు అడ్డంగా వాహనాలు నిలిపితే చట్టప్రకారం జరిమానాలు, అవసరమైతే వాహనాలను టోయింగ్ చేసే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రోడ్లు అందరివి... పార్కింగ్ మీ ఇష్టారాజ్యం కాదు. ట్రాఫిక్ నియమాలను పాటించడం ప్రతి వాహనదారుడి బాధ్యత.

ఇబ్బందిగా పడుతున్నాం..

రోడ్డు మొత్తం వాహనాలు పార్క్ చేయడంతో వెళ్లడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతిరోజూ ట్రాఫిక్లో సమ యం వృథా అవుతోంది. అధికారు లు కఠిన చర్యలు తీసుకోవాలి.

 సింగిరెడ్డి కొండల్ రెడ్డి, స్థానికుడు

ట్రాఫిక్ నియమాలు పాటించాలి..

ఇష్టారీతిలో పార్కింగ్ వల్ల అంబులెన్సులు, స్కూల్ బస్సులు  ఇబ్బంది పడుతున్నాయి. ట్రాఫిక్ నియమాలు పాటిస్తే సమస్య తగ్గుతుంది.

 సురేష్ గౌడ్, స్థానికుడు

అసౌకర్యానికి గురవుతున్నాం..

రోడ్లు పార్కింగ్ కోసం కాదు, ప్ర యాణం కోసం. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపేయడం వల్ల ప్రజ లు అసౌకర్యానికి గురవుతున్నాం.

 స్వాతి, స్థానికురాలు

నిరంతరం తనిఖీలు నిర్వహించాలి..

నోపార్కింగ్ బోర్డులు ఉన్నా కొంద రు పట్టించుకోవడం లేదు. అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిం చాలి. 

 మహమ్మద్ గౌస్, స్థానికుడు