11 July, 2026 | 3:32 AM

ఎలక్ట్రిక్ బస్సులు వద్దు.. డీజిల్ బస్సులే ముద్దు

11-07-2026 02:25 AM
  1. కొత్తగా డీజిల్ బస్సులనే కొనాలి
  2. ఆర్టీసీ జేఏసీ నేతల డిమాండ్
  3. ఎండీ నాగిరెడ్డికి వినతిపత్రం అందజేత

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): కాలుష్య నివారణ పేరుతో ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టారని, ఇటీవల కాలంలో జేబీఎం, ఒలెక్ట్రా బస్సులు షార్ట్ సర్యూట్‌తో దగ్ధమవుతున్నాయని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. దీంతో ఎలక్ట్రిక్ బస్సులు, వద్దు డీజిల్ బస్సులే ముద్దు అంటూ ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డికి శుక్రవారం జేఏసీ చైర్ట న్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డితోపాటు నేతలు ఎండీ మౌలానా, కత్తుల యాదయ్య, బి యాదగిరి శుక్రవారం కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఎలక్ట్రిక్ బస్సులను మరమ్మతు చేసేందుకు ఆయా కంపెనీలకు తరలించడంతో బస్సులు తగ్గిపోయి డిపోల్లో పనిచేస్తున్న కండక్టర్లకు డ్యూ టీలు లేకపోవడంతో నిత్యం లీవులు వేస్తున్నారని తెలిపారు. ఇంకా కొంత మందికి ఇతర డిపోలకు బదిలీ చేయడంతో కార్మికులు తీవ్ర అభద్రతా భావంతో ఉన్నారని పేర్కొన్నారు.

డీజిల్ బస్సులు ఎలాంటి ప్ర మాదాలు సంభవించకుండా ఎప్పటి నుం చో పనిచేస్తున్నాయని, అందుకే డీజిల్ బ స్సులే ఉత్తమమని భావిస్తున్నామన్నారు. ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల స్థానంలో డీజిల్ బస్సులను కొనుగోలు చేసి నడిపించాలని డిమాండ్ చేశారు.