11 July, 2026 | 3:06 AM

‘సర్’ విధులకు రాకుంటే కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్న అధికారులు

11-07-2026 02:26 AM

బీఎల్వోలు, ఆశ వర్కర్లు, ఆర్పీల ఆందోళన

సికింద్రాబాద్, జూలై 10 (విజయక్రాంతి): స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ (సర్) విధులకు గైరాజరైతే కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే ఎస్‌ఐఆర్ నమోదు చేస్తామని అధికారులు తీవ్రంగా ఫోన్లో, మరియు డైరెక్ట్ గా హెచ్చరించారు. సికింద్రాబాద్ కంటోన్మెం ట్ బోర్డు పరిధిలో పనిచేస్తున్న బీఎల్ వోలు, ఆశ వర్కర్లు, ఆర్పీలు తమ బకాయి జీతాలు విడుదల చేయాలని, లేకపోతే ’సర్’ డ్యూటీని బహిష్కరిస్తామని ధర్నాలు చేపట్టిన నేపథ్యంలో అధికారులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల వాట్సాప్ గ్రూప్ కు వరుసగా వాయిస్ మెసేజ్ లు పంపుతూ విధుల్లో చేరాలని స్పష్టంమైన ఆదేశాలు ఇచ్చారు.

ఎలాంటి మినహాయింపులు లేకుండా ప్రతి ఒక్కరూ హాజరుకావాలని, ఈ విషయమై ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో), కలెక్టర్ తో చర్చలు జరిగాయని పేర్కొన్నారు. డిఎల్‌ఓ లుఆర్పీలకు అధికారుల హెచ్చరికలు కంటోన్మెంట్ ప్రాంతంలో చర్చనీయాంశమయ్యాయి. విధులకు రాని వారి వివరాలను హెడ్ ఆఫీస్ కుపంపి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఉన్నతాధికారుల ఆదేశాలతో కేసులు కూడా నమోదు చేస్తామని అధికారులు మెసేజ్ రూపంలో తెలియజేశారు. రేపటి నుంచి ఎలాంటి సాకులు చెప్పకుండా విధులకు అటెండ్ కావాలని చెప్పారు. ఒకవైపు ఉద్యోగుల ఆందోళనలు. మరోవైపు అధికారుల ఎస్‌ఐఆర్ హెచ్చరికలతో కంటోన్మెంట్ నియోజకవర్గం ప్రజలలో చర్చనీయాంశమయ్యాయి.