21 April, 2026 | 8:35 PM

నిమ్మపల్లిలో టీబి ముక్త్ భారత్ అభియాన్

21-04-2026 06:42 PM

– 98 మందికి ఎక్స్‌రే పరీక్షలు

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతిప్రణాళికలో భాగంగా మంగళవారం టీబి ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించారు. హైరిస్క్ గ్రామాల ఎంపికలో భాగంగా ఎక్స్‌రే పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ గారిమా అగర్వాల్ మరియు జిల్లా వైద్యాధికారి డా. రజిత ఆదేశాల మేరకు డా. సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా మొత్తం 98 మందికి ఛాతీ ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నిమ్మపల్లి సర్పంచ్ స్వప్న నాగరాజు, ఉపసర్పంచ్ మానుక సత్యం, సూపర్వైజర్లు రషీద్, సువర్ణ, టీబి సూపర్వైజర్లు జేత్య, గంగాధర్, ఎక్స్‌రే టెక్నీషియన్ బాలు, పంచాయతీ కార్యదర్శి అనిల్, ఏఎన్ఎమ్ లు సరోజ, సుష్మా, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.గ్రామస్థులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవాలని వైద్యాధికారులు సూచించారు.