29 April, 2026 | 11:07 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

29-04-2026 09:34 PM

బెల్లంపల్లి,(విజయ క్రాంతి): ఎస్ఎస్సి 2026 ఫలితాలలో పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి మండల స్థాయిలో అగ్రస్థానంలో నిలబడ్డారు. పాఠశాల విద్యార్థిని ఓ. నిత్యశ్రీ 571/600 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా, వెంగల ఈశ్వర్ 568/600 మార్కులతో ద్వితీయ స్థానం, బొల్లు రిషిత 565/600 మార్కులతో తృతీయ స్థానం సాధించారు. అదేవిధంగా పాఠశాలకు చెందిన 24 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ ఈ. రవి ప్రసాద్, ప్రిన్సిపాల్ యం. రాజ రమేష్ అభినందించారు.