9 July, 2026 | 1:22 AM

మాజీ ఎన్నికల కమిషనర్‌కు సర్ పత్రాలు అందించిన తహసీల్దార్

09-07-2026 12:25 AM

శంకర్‌పల్లి; జూలై 8 (విజయక్రాంతి): మండలం పొద్దుటూరు గ్రామ శివారులోని ప్రగతి రిసారట్స్ లో నివాసముంటున్న భారత మాజీ ఎన్నికల కమిషనర్ లింగుడోకు బుధవారం  తహసిల్దార్ సురేందర్ సర్ ధ్రువ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్ ప్రక్రియ మండలంలోని అన్ని గ్రామాలలో, మున్సిపల్ పరిధిలోని ప్రాంతాలలో చురుకుగా కొనసాగుతున్నదని తెలిపారు.

ఓటర్లు తమ నమోదు వివరాల సవరణ, చిరునామా మార్పు, పేర్ల తొలగింపు వంటి సేవలను అందించేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.