క్లీన్ ఎనర్జీతోనే సుసిరావృద్ధి
- సాంకేతికలు ఎంతగానో దోహదపడతాయి
- విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య
- 10 నుంచి నిర్వహించనున్న జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): వాతావరణ మార్పుల(Climate change)ను ఎదుర్కోవడానికి, ప్రపంచస్థాయి సుస్థిర అభివృద్ధిని సాధించడానికి క్లీన్ ఎనర్జీ(Clean Energy) (హరిత ఇంధన{Green energy}) సాంకేతికతలు(Technologies) ఎంతగానో దోహదపడతాయని విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య(Lavu Rattayya) అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలం, దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ(Vignan University)లో బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘హార్నెసింగ్ క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్ టు డ్రైవ్ సస్టైనబిలిటీ అండ్ కాంబ్యాట్ క్లైమేట్ ఛేంజ్ వరల్డ్‌వైడ్’ అనే అంశంపై ఈనెల 10 నుంచి 12 వరకు నిర్వహించనున్న మూడు రోజుల జాతీయ సదస్సు బ్రోచర్‌ను డాక్టర్ లావు రత్తయ్య ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) మాతృభాషలలో సాంకేతిక విద్యను పెంపొందించేందుకు ప్రవేశపెట్టిన ‘ఏఐసీటీఈవాణి’ పథకం కింద ఈ సదస్సును నిర్వహించడం అభినందనీయమన్నారు.
కాగా ఈ జాతీయ సదస్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, స్పేస్ టెక్నాలజీ, బయోడైవర్సిటీ, క్లీన్ ఎనర్జీ, క్లైమేట్ ఛేంజ్, సుస్థిర అభివృద్ధి వంటి అభివృద్ధి చెందుతున్న నూతన సాంకేతిక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. సదస్సులో ఐఐటీ తిరుపతి, మద్రాస్, సీఎస్‌ఐఆర్-ఐఐసీటీ , ఉస్మానియా విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి ప్రముఖ విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు పాల్గొని ప్రసంగించనున్నారు.
ఏఐసీటీఈ ఆమోదిత విద్యాసంస్థల అధ్యాపకులు, పరిశోధకులు ఈ నెల 8వ తేదీలోపు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోనేందుకు అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్స్ యూనివర్సిటీ అడ్వైజర్, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య, విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వర రావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.






