3 June, 2026 | 9:39 PM

వాటర్ ట్యాంక్ రూములో యువకుడి అనుమానాస్పద మృతి

03-06-2026 08:24 PM

తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధి రావెల్లి వెంచర్ లోని వాటర్ ట్యాంకు రూమ్ లో ఆబ్బు హేజిఫా 21 డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా యువకుడు అనుమానాస్పద మృతి చెందినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు మృతుని తల్లిదండ్రులు పేర్కొన్నారు. పోలీసుల వివరాల ప్రకారము తూప్రాన్ డబుల్ బెడ్ రూమ్ లలో నివాసముంటున్న మహమ్మద్ షరీఫ్ తన చిన్న కుమారుడు అబ్బు హేజీఫా బుధవారం ఇంట్లో నుండి ఒంటిగంట సమయంలో చెప్పకుండా వెళ్లిపోవడం జరిగింది.

ఎంతకీ తిరిగి రాకపోగా మేము నా కుమారుని మొబైల్ కి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అనుమానం వచ్చి చుట్టుపక్కల వెతికిన ఆచూకీలభ్యం కాలేదు. తిరిగి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తన స్నేహితుడు రావెల్లి శివారులోని ఒక వెంచర్ వాటర్ ట్యాంక్ రూంలో ఉరివేసుకొని ఉన్నట్లు సమాచారం అందించగా తక్షణమే మేము అక్కడికి చేరుకొని గుర్తించారు. మా కుమారుడి మరణం పై పలు అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.