3 June, 2026 | 9:38 PM

ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే మదన్మోహన్ లక్ష్యం

03-06-2026 08:27 PM

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని వరద ముంపు గురైన బ్రిడ్జిల నిర్మాణం కు 8.50 లక్షలు నిధులు మంజూరు

ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): గత నాలుగు నెలల క్రితం భారీగా కురిసిన వర్షానికి అతలాకుతలమైన ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ మండలంలోని లింగంపల్లి ఉర్దూ వద్ద ఉన్న కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారి మార్గమధ్యలో ఉన్న వంతెన కొట్టుకపోవడంతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రత్యేక చొరవతో లింగంపేట్ మండలంలో లింగంపల్లి కుర్దు కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై వంతెన నిర్మాణం కొరకు నాలుగు కోట్ల రూపాయలు ఎల్లారెడ్డి మండలంలోని అడవి లింగాల గేట్ సమీపంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారిపై వంతెన నిర్మాణం కొరకు 4.50 లక్షల రూపాయలతో, హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం కు మొత్తం ఎనిమిది కోట్ల 50 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే మదన్మోహన్ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షాలకు కొట్టుకుపోయిన వంతెన పట్ల ప్రజలకు కలిగిన ఇబ్బందులను తన సమస్యగా భావించి సంబంధిత శాఖ అధికారులతో చర్చించి ప్రత్యేక జ్వరంతో పనులు చేపట్టినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి అన్నారు.