అనుమానాస్పద మృతి
కేసు నమోదు: ఎస్‌ఐ నరేందర్ రెడ్డి
బాలానగర్ ఆగష్టు 2: మండల్ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. బాలానగర్ ఎస్త్స్ర నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన మిర్జా సర్దార్ బేగ్ (50) తన భార్య ఫర్హత్ ఉన్నిసా, ముగ్గురు పిల్లలతో కలిసి మండల కేంద్రం సమీపంలోని సిబాల్ కంపెనీ వద్ద ఉన్న ఓ ఫామ్హౌస్లో గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో గొర్రెల మందలోకి వెళ్తుండగా ఒక్కసారిగా కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికులు గమనించేలోపే అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫర్హతు ఉన్నిసా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని ఎస్త్స్ర నరేందర్ రెడ్డి తెలిపారు.






