calender_icon.png 14 February, 2026 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుది కూర్పు పై సస్పెన్స్

14-02-2026 12:11:04 AM

పాకిస్థాన్‌తో ఆదివారం జరగబోయే హైవోల్టేజ్ ఫైట్ కోసం భారత తుది జట్టు కూర్పు సస్పెన్స్ కొనసాగుతోంది. అభిషేక్ శర్మ ఆడడంపై సందిగ్ధత నెలకొనగా.. రింకూ సింగ్‌ను తప్పించడం ఖాయమైంది. కొలంబో పిచ్ దృష్ట్యా వాషింగ్టన్ సుందర్‌ను తీసుకుంటారని సమాచారం. అభిషేక్ శర్మ రీఎంట్రీ ఇస్తే మాత్రం సంజూ ఇక బెంచ్‌కే పరిమితం కానున్నాడు.

  1. అభిషేక్ ఆడతాడా ?
  2. రింకూ ప్లేస్‌లో వరుణ్ చక్రవర్తి
  3. పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్

కొలంబో, ఫిబ్రవరి 13 : నమీబియాతో విజయంతో సూపర్-8కు చేరువైన టీమిండి యా ఇప్పుడు కొలంబోకు వెళ్లింది. ఆదివా రం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడబోతోంది. ఈ మ్యాచ్‌పై చాలా వివాదం చెలరే గినా చివరకు పాక్ వెనక్కి తగ్గి ఆడేందుకు మొగ్గుచూపడంతో అందరి చూపు ఇప్పుడు హోరాహోరీ పోరుపైనే ఉంది. కాగా పాక్‌తో మ్యాచ్ కోసం భారత తుది జట్టు ఎంపిక ఇ ప్పుడు సవాల్‌గా మారింది.

ముఖ్యంగా అభిషేక్ శర్మ ఆడడంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. నమీబియాతో మ్యాచ్ సందర్భంగా టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్ అభిషేక్ పాక్‌తో మ్యాచ్ ఆడడం అనుమానమేనంటూ చెప్పాడు. మ్యాచ్ ముగిసిన తర్వా త వరుణ్ చక్రవర్తి మాత్రం అభిషేక్ ఆదివారం మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొ న్నాడు. ఇప్పుడు జట్టుతోపాటే కొలంబో వెళ్లిన అభిషేక్ శర్మ ప్రస్తుతం ఫిట్‌నెస్ సా ధించే పనిలో ఉన్నాడు.

శనివారం జరిగే ప్రాక్టీస్ సెషన్‌లో ఎటువంటి ఇబ్బందీ లేకుం డా బ్యాటింగ్ చేస్తే మాత్రం పాక్ బౌలర్లకు చుక్కలే. ఒకవేళ అభిషేక్ శర్మ దూరమైతే మా త్రం సంజూశాంసన్‌కు మరో అవకాశం దక్కొచ్చు. వరుసగా ఎన్ని అవకాశాలిచ్చినా సంజూ నిరాశపరుస్తూనే ఉన్నాడు. మరోవైపు మిగిలిన జట్టులో మరో మార్పు చేయ డం ఖాయంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగానే ఉండడంతో కొలంబో పిచ్ దృష్ట్యా రింకూసింగ్‌ను తప్పించి వాషింగ్టన్ సుందర్‌ను తీసుకుంటారని భావిస్తున్నారు. వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ ఖచ్చితంగా జట్టుకు కలిసొస్తుంది.

ఈ రెండు మార్పులు తప్పిస్తే మిగతా కాంబినేషన్‌లో మార్పులు జరిగే అవకాశం లేదు. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్‌లోకి వస్తే తిరుగుండదు. ఇషాన్ కిష న్, హార్థిక్ పాండ్యా తమ నిలకడైన ఆటతీరును కొనసాగిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. బౌలింగ్‌లో పేసర్లుగా బుమ్రా, అర్షదీప్‌సింగ్‌నే కొనసాగించనున్నారు. దీంతో మహ్మద్ సిరాజ్‌కు నిరాశే మిగలనుంది.

స్పిన్నర్లుగా అక్షర్ పటేల్, వరు ణ్ చక్రవర్తిలకు తోడు వాషింగ్టన్ సుందర్ కూడా జట్టులోకి వస్తే పాక్ బ్యాటర్లకు కష్టా లు తప్పవు. కాగా పాక్ వివాదాస్పద స్పిన్నర్ తారిఖ్‌ను ఎదుర్కొనేందుకు భారత్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు అర్థమవుతోంది. మరోవైపు కొలంబో పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుందని అంచనా.

దీనికి అనుగుణంగానే తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక గత రికార్డులను చూస్తే భారత్‌దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 16 సార్లు తలపడితే 13 సార్లు భారత్ గెలిచింది. ఇటీవల ఆసియాకప్ ఫైనల్లో పాక్‌ను చిత్తు చేసిన టీమిండియానే ఫేవరెట్‌గా చెబుతున్నారు.

భారత తుది జట్టు (అంచనా)

అభిషేక్ శర్మ/సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్‌దూబే, అక్షర్‌పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్.