11 May, 2026 | 10:40 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

దేవాలయ భూములకు సర్వే

11-05-2026 09:21 PM

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండేపూడి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి చెందిన భూమి సర్వే నంబర్లు 348, 374, 375, 376, 379 పరిధిలో ఉన్న మొత్తం 8 ఎకరాలు 13 గుంటల భూమికి సంబంధించి అధికారులు సర్వే చేసి హద్దు రాళ్లు ఏర్పాటు చేశారు. ఈ సర్వేలో అన్యాక్రాంతానికి గురైన 1 ఎకరం 30 గుంటల దేవాలయ భూమిని గుర్తించి తిరిగి హద్దులను నిర్ణయించారు. హద్దు రాళ్లను ఎవరైనా తొలగించినట్లయితే దేవాదాయ శాఖ చట్టం 30/87 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.