అనురాగ్‌లో ఐఈఈఈ సదస్సు
01-08-2026 12:09 AM
ఘట్‌కేసర్, జూలై 31 (విజయక్రాంతి) : అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, భవిష్యత్ కంప్యూటింగ్ రంగంపై విశ్లేషణాత్మక చర్చలకు వేదికగా నిలుస్తూ కంప్యూటింగ్ ది ఫ్యూచర్ అనే ప్రధాన అంశంతో ఐఈఈఈ సదస్సు ప్రారంభ కార్యక్రమాన్ని అనురాగ్ యూనివర్సిటీ లో శుక్రవారం నిర్వహించారు. ఈ సదస్సులో ప్రముఖ విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు, ఐఈఈఈ ప్రతినిధు లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.






