31 July, 2026 | 10:27 PM

దేశీదారు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

31-07-2026 09:52 PM

తాంసి/భీంపూర్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడా బాంద్రా గ్రామానికి చెందిన గజ్జల స్వామి మహారాష్ట్ర నుంచి అక్రమంగా దేశీ దారును తీసుకువచ్చి విక్రయిస్తున్నాడనే విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం భీంపూర్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద ఉన్న దేశీ దారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు భీంపూర్ ఎస్‌ఐ పీర్ సింగ్ తెలిపారు.