1 August, 2026 | 1:05 AM

పోస్టాఫీస్ పథకాలపై అవగాహన

01-08-2026 12:11 AM

ఘట్ కేసర్, జూలై 31 (విజయక్రాంతి) : పోస్టాఫీస్ లో అన్ని రకాల వయస్సు వారికి పథకాలు ఉన్నాయని వాటిని అందరూ వినియోగించుకోవాలని పోస్టల్ శాఖ అసిస్టెంట్ సూపరిండెంట్ జి.బి. సత్యేంద్ర కృష్ణ అన్నారు. ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని ప్రతాప సింగారం పోస్టాఫీస్ ఆవరణలో శుక్రవారం పోస్టల్ పథకాల మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, పోస్టల్ శాఖ ఎంఓ వి. విజయ్, ప్రతాప సింగారం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ నిఖిత, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.