11 May, 2026 | 10:41 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి

11-05-2026 09:24 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని వెంకటరావుపేట ఎక్స్ రోడ్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్సై ప్రశాంత్ రెడ్డి తెలిపారు.మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యువత ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించి సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.ఈ తనిఖీల కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.