13 March, 2026 | 2:25 PM

తిరుమల లడ్డూ వ్యవహారం.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

13-03-2026 12:56 PM

న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ వ్యవహారంపై(Tirumala laddu) దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు(Supreme Court) ధర్మాసనం కొట్టేసింది. జంతు కొవ్వు కలిసిందని రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు వ్యాఖ్యానిస్తున్నారని సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాఖ్యల వ్యవహారంపై సీబీఐ(Central Bureau of Investigation) ఎలాంటి దర్యాప్తు జరపలేదని పిటిషన్ పేర్కొన్నారు.

ఇలాంటి వ్యాఖ్యలను నిలువరించాలని సుప్రీంకోర్టులో పిటిషనర్ పిటిషన్ దాఖలు చేశాడు. అన్ని అంశాలు పరిశీలించాకే సీబీఐతో సిట్(Special Investigation Team) వేయించామని సుప్రీంకోర్టు తెలిపింది. ఏదైనా ఉంటే సీబీఐ ముందు చెప్పుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. దర్యాప్తు పెండింగ్ లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోలేమని సీజేఐ స్పష్టం చేశారు.