ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్(Justice Lisa Gill sworn) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ లిసా గిల్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్నారు.
జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్(Justice Dhiraj Singh Thakur) పదవీ విరమణ అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court judge) తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ చరిత్ర సృష్టిస్తారు. 1990లో న్యాయవాదిగా జస్టిస్ లిసా గిల్ పేరు నమోదు చేసుకున్నారు. 2014 మార్చి 31న పంజాబ్-హరియాణా హైకోర్టు జడ్జిగా నియామకం అయ్యారు.




